అక్షరటుడే, జుక్కల్‌: ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ ఎంతో కృషిచేస్తోందని నిజాంసాగర్‌ ఎస్సై సుధాకర్‌ తెలిపారు. అత్యవసర పరిస్థితులు వస్తే డయల్ 100కు ఫోన్‌ చేయాలని సూచించారు. సోమవారం నిజాంసాగర్‌ కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు షీటీం, సైబర్‌ క్రైంపై కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. యువతులు, మహిళలు తమకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే షీటీంకు 8712686094, సైబర్‌ నేరాలపై టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ప్రభాకర్‌, సాయిలు, శేషారావు, ప్రిన్సిపాల్‌ సరోజన, కళాబఅందం సభ్యులు పాల్గొన్నారు.