అక్షరటుడే, ఇందూరు: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, పార్టీ జిల్లా కార్యదర్శి న్యాలం రాజు అన్నారు. మంగళవారం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ను నెరవేర్చలేదన్నారు. చేతివృత్తిదారులకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. బీసీ యువత, చిరు వ్యాపారులు, విద్య కోసం రూ.10 లక్షలు అందిస్తామన్న హామీని సైతం విస్మరించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పోతన్ కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, విజయ్ నాయకులు నాగరాజు, పంచరెడ్డి శ్రీధర్, శ్రీనివాస్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.