అక్షరటుడే, వెబ్ డెస్క్: కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ పేకాట స్థావరంపై దాడి జరిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తకుంట శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో సీఐ పురుషోత్తం సిబ్బంది లక్ష్మన్న, సుదర్శన్, రాజేశ్వర్, రాములు, అనిల్ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు జరిపారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.55 వేల నగదు సీజ్ చేశారు. అనంతరం రూరల్ పోలీసులకు అప్పగించారు.