అక్షరటుడే కామారెడ్డి టౌన్: పట్టణ ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని 4, 5 వార్డుల్లో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఛైర్ పర్సన్ మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్, లడ్డు, ఇమ్రాన్, మోయినుద్దీన్, పాత శివ, చాట్ల వంశీ, కృష్ణమూర్తి, పిడుగు మమత, సాయిబాబా, స్పెషల్ ఆఫీసర్ రమ్య, అంగన్ వాడీ తదితరులు పాల్గొన్నారు.