అక్షరటుడే, ఇందూరు: నగరంలోని తిలక్ గార్డెన్ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఏడీఈ తోట రాజశేఖర్ తెలిపారు. ఖలీల్ వాడి, సరస్వతీ నగర్, గాంధీ చౌక్, మార్వాడీ గల్లీ, జవహర్ రోడ్, హెడ్ పోస్టాఫీస్, వన్ టౌన్, కుమార్ గల్లి, రాష్ట్రపతి రోడ్డు, దేవీ రోడ్డు చౌరస్తా ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.