కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల మండిపాటు

0

అక్షరటుడే, బోధన్: ఎమ్మెల్సీ కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై బోధన్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కరెంట్ బిల్లు కట్టవద్దని ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాదని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ పద్మ శరత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పేరిట ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎమ్మెల్సీ కవిత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. మాట ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ హామీలు అమలు చేసి అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.