అక్షరటుడే, జుక్కల్‌: పెద్దకొడపగల్‌ ఆర్‌ఐ పండరిని విధుల నుంచి తొలగిస్తూ కామారెడ్డి కలెక్టర్‌ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రజావాణి జరుగుతుండగా రైతు అంజయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆర్‌ఐ తనవద్ద రూ.20 వేలు తీసుకుని పట్టా పాస్‌ పుసకం ఇవ్వట్లేదని బాధితుడు ఆరోపించాడు. కాగా.. విచారణ జరిపిన అధికారులు ఆర్‌ఐ పండరిని విధుల నుంచి తొలగించారు.