అక్షరటుడే, బాన్సువాడ: రేషన్ డీలర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు మండిపడ్డారు. బుధవారం బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీవో రమేష్ రాథోడ్ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలో అభ్యర్థులకు సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారని, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. అర్హత పరీక్షలు నిర్వహించిన అధికారులు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉండగా.. కావాలనే ఇంటర్వ్యూల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్,అధికార ప్రతినిధి హన్మాండ్లు, కోణాల గంగారెడ్డి, ప్రసాద్, సాయి కిరణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.