అక్షరటుడే, జుక్కల్‌: మహమ్మద్‌నగర్‌ మండలం గాలిపూర్‌లో గతంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌పై బుధవారం ఎంపీవో అనిత విచారణ చేపట్టారు. జీపీ కార్యదర్శిపై పది రోజుల క్రితం కొందరు గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీవో గాలిపూర్‌ గ్రామాన్ని సందర్శించి విచారణ నిర్వహించారు. సెక్రెటరీ తమ వద్ద నుంచి ఇంటి మార్పిడి, ధ్రువీకరణ పత్రాలు, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు లంచాలు తీసుకున్నాడని వివరించారు. అంతేకాకుండా తమకు డూప్లికేట్‌ రశీదులు ఇచ్చాడని.. డబ్బులు చెల్లించినా ఆన్‌లైన్‌లో తమ పేరు మార్పిడి కాలేదని ఎంపీవోకు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.