అక్షరటుడే, వెబ్ డెస్క్: ఉద్యోగులు, పెన్షనర్ల కోసం జిల్లాలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమ సమన్వయ కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు ఎంపీ ధర్మపురి అర్వింద్ ను బుధవారం కలిసి విన్నవించారు. కాగా, గతంలోనూ ఎంపీకి వివరించగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. నిజామాబాద్ డివిజన్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారిపై ఆధారపడినవారు సుమారు 7500 మందికి పైగా ఉంటారని, ఆరోగ్య చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి జిల్లాలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని మరోమారు ఎంపీని కోరారు. దీంతో స్పందించిన ఆయన తగిన కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రతాపరెడ్డి, షేక్ హుస్సేన్, మోహన్ దాస్, నారాయణ, నవీన్ కుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు.