అక్షర టుడే, వెబ్ డెస్క్: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని వ్యవసాయ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరగా కేబినెట్ పదవి వరించింది. బీఆర్ఎస్ హయాంలో పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్ గా పనిచేశారు.