అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని దోమకొండ మండలం ముత్యంపేట సొసైటీ ఛైర్మన్ కోడిప్యాక తిరుపతిగౌడ్, భిక్కనూరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కుంచాల శేఖర్ డిమాండ్ చేశారు. దోమకొండలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని ఈ నెల 22న (గురువారం) జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంతోమంది రైతులు రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు బోరెడ్డి కిషన్ రెడ్డి, నాయకులు గజవాడ శ్రీకాంత్, పాలకుర్తి శేఖర్, బమ్మెర శ్రీనివాస్, బుర్రి రవి కుమార్, వీణ, సలీం, బోరెడ్డి నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.