అక్షరటుడే, బాన్సువాడ: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును పున:సమీక్షించాలని నాయకులు కోరారు. వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత కల్యాన్ సమితి, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన భారత్ బంద్‌లో భాగంగా బాన్సువాడ పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ఉన్నత న్యాయస్థానం రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశాయిపేట్ ప్రశాంత్, మల్లూరు సాయిలు, దొనకంటి వినోద్, నెర్రె నర్సింలు, పాండు, అశోక్, హనుమంతు, సాయిలు పాల్గొన్నారు.