అక్షరటుడే, ఇందూరు: సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా అధ్యక్షుడు వెనిగల్ల సురేష్ అధ్యక్షతన నిజామాబాద్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. జీపీఎఫ్ కు సంబంధించిన నిధులను ఉపాధ్యాయులకు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. మెడికల్ బిల్లులు, లోన్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, అరవింద్, ఫరూక్, మల్లేశం, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.