అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు బోధించడానికి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ధనవేణి తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థినులు అర్హులన్నారు. నెట్ సెట్, పీ హెచ్ డీ, బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 11లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా 19న ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థినులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.