అక్షరటుడే, జుక్కల్: రుణమాఫీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అనేక మంది రైతులకు రుణమాఫీ అమలు చేయకుండానే గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.