అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఉండాలని యాంటీ నార్కోటిక్స్‌ డీఎస్పీ సోమనాథ్‌ సూచించారు. నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనమవుతుందన్నారు. యువత ఉజ్వల భవిష్యత్తు కోసం బాగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ టౌన్‌ సీఐ నరహరి, మూడో టౌన్ ఎస్సై నర్సయ్య, కళాశాల ప్రిన్సిపాల్‌ పాల్గొన్నారు.