అక్షరటుడే, బాన్సువాడ: ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బాన్సువాడ పట్టణంలో ఎల్‌ఆర్‌ఎస్ అమలు తీరును శుక్రవారం క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకున్న వారికి ముందస్తు సమాచారం ఇచ్చి క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లాలని అధికారులకు సూచించారు. సర్వే నంబర్, ప్లాట్ నంబర్, రోడ్డు విస్తరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, తహసీల్దార్ వరప్రసాద్, ఇరిగేషన్ ఏఈ గజానంద్, ఎంపీడీవో బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.