అక్షరటుడే, బోధన్‌: రష్యాలోని ఎల్‌బ్రస్‌ పర్వత్వాన్ని అధిరోహించిన నవీపేట మండలం నాళేశ్వర్‌కు చెందిన మారుతిని బినోల సొసైటీ ఛైర్మన్‌ హన్మాండ్లు, వీడీసీ సభ్యులు సన్మానించారు. శుక్రవారం గ్రామానికి విచ్చేసిన యువకుడికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ గతేడాది కిలిమాంజిరో పర్వతాన్ని అధిరోహించానని.. ప్రస్తుతం రష్యాలోనే ఎత్తయిన ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని ఎక్కడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ.. మారుతి ఎల్ బ్రస్ పర్వతాన్ని అధిరోహించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు సురేష్‌, మోహన్‌, వివేకానంద యువ విబాగ్‌ సభ్యులు, శేఖర్‌, రఘు, రాకేశ్‌, ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.