అక్షరటుడే, వెబ్ డెస్క్: వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనలో భిక్కనూరులో చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనకు కారణమైన నూర్ ప్రైవేట్ ఆస్పత్రిని శనివారం అధికారులు సీజ్ చేశారు. భిక్కనూర్ మండల కేంద్రంలోని సదరు ఆస్పత్రిని డిప్యూటీ డీఎంహెచ్వో ప్రభుకిరణ్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. వైద్యం వికటించి మృతి చెందిన ఘటనను సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తగు చర్యలకు ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రిని, మందుల షాపును సీజ్ చేశారు.