అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని పలు షాపుల్లో ఫేక్ యూపీఐ లావాదేవీలు చేసిన యువకుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ అమర్ అనే యువకుడు నగరంలోని పలు మొబైల్ దుకాణాల్లో ఫోన్‌లు కొనుగోలు చేశాడు. అనంతరం డబ్బులను ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా ఫేక్ యూపీఐ లావాదేవీలు జరిపాడు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన యజమానులు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు ఇలా రూ.57వేలు మోసగించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.