అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: మట్కా స్థావరంపై దాడి చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు నిజామాబాద్‌ వన్‌ టౌన్‌ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మిర్చి కాంపౌండ్‌లో ముగ్గురు యువకులు ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. మట్కా నిర్వహిస్తున్న మహమ్మద్‌ ముజాహిద్‌, షేక్‌ హమీద్‌, షేక్‌ నాజర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.29,690 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.