అక్షరటుడే, కామారెడ్డి టౌన్: హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కామారెడ్డిలో అనేక చోరీలకు పాల్పడిన ఓ ఘరానా దొంగను అరెస్టు చేసినట్లు కామారెడ్డి రూరల్ సీఐ రామన్ తెలిపారు. మంగళవారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో 102 చోరీలకు పాల్పడిన దొంగను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నర్సన్నపల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడు మీర్ ఖజామ్ ఆలీ ఖాన్ పట్టుకుని విచారించగా చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 10 తులాలకు పైగా బంగారంతో పాటు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మీర్ కజామ్ ఆలీ ఖాన్ పై హైదరాబాద్ కమిషనరేట్, సంగారెడ్డి జిల్లా పరిధిలో కలిపి 102 కేసులు నమోదయ్యాయన్నారు. హైదరాబాద్ లోని టోలిచౌకికి చెందిన నిందితుడు మీర్ ఖజామ్ ఆలీ ఖాన్ అలియాస్ కాజు అలియాస్ సూర్యా భాయ్ గా చలామణి అవుతున్నట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కేసులో కీలకంగా వ్యవహరించిన దేవునిపల్లి ఎస్సై రాజు, ఎస్సై-2 మధుసూదన్ రెడ్డి, సిబ్బంది రామస్వామి, బాలకృష్ణ, హోంగార్డు రాజు, టెక్నికల్ సిబ్బంది రోహిత్, శ్రీనును అభినందించారు.