అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన రాగి బాలవ్వ(62) స్థానిక ఎల్లమ్మ గుడి వైపు వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో వృద్ధురాలు ఎగిరి కారుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జాతీయ రహదారి అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కామారెడ్డి తరలించగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.