జగిత్యాలలో పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించండి

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లాలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. జగిత్యాలలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను మంత్రికి తెలియజేశారు. జగిత్యాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారు ఉపాధి, ఉన్నత చదువుల కోసం తరచుగా గల్ఫ్ దేశాలకు వెళ్తారని, ఇక్కడ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం లేకపోవడంతో నిజామాబాద్ లేదా కరీంనగర్ కి వెళ్లి సేవలు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే జగిత్యాల పరిసర ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న టువంటి కీలక సేవలు మరింత అందుబాటులో ఉంటాయని ఆయన లేఖలో వివరించారు. తమ యొక్క విజ్ఞప్తిని మంత్రి దృష్టికి తీసుకెళ్లి, జిల్లాలో పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చొరవ చూపిన ఎంపీ అర్వింద్ కు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.