అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం మండలంలోని గర్గుల్ లో పల్లె దవాఖాన, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ వివరాలు, ల్యాబ్, ఫార్మసీ పరిశీలించారు. పరిసరాలు పరిశీలించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట డీఎంహెచ్ వో చంద్రశేఖర్ ఉన్నారు.