అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా గురువారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవం నిర్వహించారు. నగరంలోని మినీ స్టేడియంలో ఉద్యోగులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, టీజీవో అధ్యక్షుడు అమృత్, నాయకులు శేఖర్, నారాయణరెడ్డి, పోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.