అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ నటించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మూవీ రిలీజ్‌కు సంబంధించి న్యాయపరమైన సంప్రదింపులు చేస్తూనే, సినిమా విడుదలను నిషేధించే ఆలోచనలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ తెలిపారు. ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం షబ్బీర్‌కు వినతిపత్రం అందజేసినట్లు సమాచారం.