అక్షరటుడే, వెబ్ డెస్క్: భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌కు మంజూరవడంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘నా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రతపై నాకు అపారమైన గౌరవం, విశ్వాసం ఉన్నాయి. న్యాయవ్యవస్థను ఎన్నటికీ అత్యున్నతమైనదిగా భావిస్తా’నని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.