అక్షరటుడే, జుక్కల్: మహారాష్ట్రలో నిర్మిస్తున్న లెండి ప్రాజెక్ట్ సందర్శనకు శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి బస్సులో ఆయన తరలివెళ్లారు. లెండి ప్రాజెక్టు నిర్మాణం, కాలువల పనితీరును పరిశీలించనున్నారు. ఆయన వెంట నాయకులు రామ్‌రెడ్డి, సాయాగౌడ్, రమేష్ దేశాయి తదితరులున్నారు.