అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: ఎస్జీటీయూ ధర్పల్లి మండల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలాధ్యక్షుడిగా న్యావనంది గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా కె.శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలిగా తిరునగరి స్వాతి, కార్యవర్గ సభ్యులుగా శ్రీధర్, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీధర్ రావు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా బాధ్యులు బదావత్ మోహన్, కన్వీనర్ వెంకటరమణ, కో-కన్వీనర్ గంగాప్రసాద్, ఉపాధ్యాయులు నరేశ్, గంగాధర్, శ్రావణ జ్యోతి, సుమలత, అపర్ణ పాల్గొన్నారు.