అక్షరటుడే, కామారెడ్డి టౌన్: డెంగీ కేసులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లాకేంద్రలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఇన్‌పేషెంట్లు, డెంగీ పాజిటివ్ బాధితులతో మాట్లాడి తెలుసుకున్నారు. జ్వరం కేసుల తీవ్రత దృష్ట్యా వైద్యులు, సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. మందుల కొరతపై వైద్యులు కలెక్టర్ దృష్టికి తేగా, కమిషనర్‌తో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు. ఏయే మండలాల నుంచి ఎక్కువ జ్వరం కేసులు వస్తున్నాయని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు.