అక్షర టుడే, కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఎంపీ సురేష్ షెట్కార్ తో కలిసి చెత్త ట్రాక్టర్లను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని, తమ హయాంలో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఎంపీ సురేష్ షెట్కార్ ను మున్సిపల్ పాలకవర్గ సభ్యులు సన్మానించారు. డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, కాంగ్రెస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.