అక్షరటుడే, కామారెడ్డి: అవసరం ఉంటే తప్పా ప్రజలు బయటకు రావొద్దని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు. సోమవారం ఆయన కామారెడ్డి పెద్దచెరువు, టేక్రియాల్ చెరువు, హౌసింగ్ బోర్డ్ పరిధిలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.