అక్షరటుడే, జుక్కల్‌: భారీ వరదలతో సింగితం రిజర్వాయర్‌ అలుగు గోడ కొట్టుకుపోయింది. మహమ్మద్‌నగర్‌ మండలంలోని నర్వ శివారులో గల సింగితం ప్రాజెక్టుకు రెండు రోజులుగా భారీగా ఇన్‌ ఫ్లో వచ్చి చేరుతోంది. వరద నీరు పోటెత్తడంతో సోమవారం మధ్యాహ్నం అలుగు గోడ కొట్టుకుపోయింది. దీంతో రిజర్వాయర్‌లో ఉన్న నీళ్లు వృథాగా పోతున్నాయి. కాగా ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌, ఏఈ శివప్రసాద్‌ రిజర్వాయర్‌ను పరిశీలించారు. వారి వెంట వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కాశీనాథ్‌, రైతులు ఉన్నారు.