అక్షరటుడే, ఇందూరు: గణేశ్ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు తమ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేయాలని సీఐ నరహరి సూచించారు. మంగళవారం ఆయన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం తదితర పూర్తి వివరాలను పోలీస్ శాఖ వెబ్సైట్ policeportal.tspolice.gov.inలో సమర్పించాలని సూచించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని పేర్కొన్నారు. డీజేకు అనుమతి లేదని, స్పీకర్‌తో కూడిన మైక్ అనుమతి కోసం పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. మండపాల వద్ద అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు.