అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని బొందెం గడ్డ చెరువు శిఖం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన నగరంలో ఆయన పర్యటించారు. ఇటీవల బొందెం గడ్డ చెరువు శిఖంలో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేయగా వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన స్పందిస్తూ.. బొందెం గడ్డ బాధితులకు ఇంటి స్థలంతో పాటు రూ.5లక్షలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక చొరవ తీసుకుని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 42 కుటుంబాలకు తనవంతుగా రూ.3వేల చొప్పున అందజేశారు. శిఖం కబ్జాకు పాల్పడి.. పేదలను మోసగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. షబ్బీర్ వెంట కేశ వేణు, నరాల రత్నాకర్ తదితరులున్నారు.