అక్షరటుడే, ఇందూరు: బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ శశిధర్ డిమాండ్ చేశారు. క్యాంపస్ ప్రధాన ద్వారం ముందు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. వీసీ పట్టించుకోవడం లేదన్నారు. ఇన్ ఛార్జి వీసీని తొలగించి రెగ్యులర్ పోస్టును నియమించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో సమస్యల పరిష్కారం కోసం క్యాంపస్ ను సందర్శించారని, ఇప్పుడేమో పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులకు ఉన్నటువంటి 17 డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ధర్నా చేసే సమయంలో సెక్యూరిటీ, ఆటో డ్రైవర్లతో ఏబీవీపీ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కార్యక్రమంలో నాయకులు సాయికిరణ్, ఆకాశ్, దినేష్, అజయ్, భోజన్న, ప్రణయ్, దేవదాస్, సాయి తదితరులు పాల్గొన్నారు.