అక్షరటుడే, కామారెడ్డి టౌన్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇందుప్రియ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు అనుష, ప్రసన్న, రాణి, మహేశ్, వనిత రామ్మోహన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.