అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో ఆదివారం మధ్యాహ్నం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సతీమణి అర్చనతో పాటు వారి కుటుంబీకులు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు గుల్ గస్తా, గోల్ బంగ్లా తదితర ప్రాంతాలను తిలకించారు. వారి వెంట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మల్లికార్జున్, కిషోర్ తదితరులున్నారు.