బీర్కూర్ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలి

Advertisement

అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్‌ తెలంగాణ తిరుమల ఆలయాన్ని దేవాదాయ శాఖ తమ పరిధిలోకి తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల సొమ్ముతో నిర్మించి ఆలయానికి కొంతమంది ధర్మకర్తలుగా చెప్పుకుని తిరుగుతుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను కేటాయిస్తే ఆలయాన్ని ఎందుకు దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆలయ పరిధిలో 114 ఎకరాల భూమి ఉందని, రెవెన్యూ అధికారులు సర్వే చేసి శాఖకు అప్పగించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

Advertisement