అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో సోమవారం బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నగేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని.. 2014లో మొదటి స్థానానికి చేరగా ఇప్పటికీ అదే రికార్డు కొనసాగిస్తుందన్నారు. బీజేపీ కార్యకర్త తన బూత్‌ పరిధిలో ప్రతి ఒక్కరినీ కలిసి పార్టీ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డిని మొదటి స్థానంలో నిలిపేలా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు మురళీధర్‌ గౌడ్‌, రంజిత్‌ మోహన్‌, చిన్న రాజులు, రాంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్‌ రెడ్డి, రవీందర్‌ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్‌, అసెంబ్లీ కన్వీనర్‌ లక్ష్మారెడ్డి, లింగారావు పాల్గొన్నారు.