అక్షరటుడే, కామారెడ్డి: గణేశ్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ సింధు శర్మ సూచించారు. కామారెడ్డి పట్టణంలో శోభాయాత్ర వెళ్లే మార్గాలను, అడ్లూరు ఎల్లారెడ్డి చెరువును కలెక్టర్ తో కలిసి ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శోభాయాత్ర మార్గాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెడతామన్నారు. నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని చెప్పారు. డీజేలు, సౌండ్ సిస్టంలు, బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.