అక్షరటుడే, ఇందూరు: భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దేశం నుంచి బహిష్కరించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీశ్ డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని దేవి టాకీస్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం సుభిక్షంగా ఉందన్నారు. కానీ అవగాహన లేకుండా దేశ ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ అర్థరహిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. విదేశీ పర్యటన మోజులో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్, నరేశ్, రాష్ట్ర నాయకులు ఎర్రం సుధీర్, నగర నాయకుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.