అక్షరటుడే, ఇందూరు: నగరంలోని బాబన్సాహెబ్ పహాడ్ నిజాంసాగర్ కెనాల్ వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదేశించారు. శుక్రవారం వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి పనులు ఆలస్యం కావద్దని సూచించారు. త్వరలో అధికారులతో సమావేశమై డివిజన్ల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం స్థానికులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, పంచరెడ్డి ప్రవలిక, తదితరులు పాల్గొన్నారు.