అక్షరటుడే, ఆర్మూర్: తామిచ్చిన గడువు మేరకు షరతులు లేకుండా రూ.రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయనందున ఈనెల 16న ఆర్మూర్ డివిజన్లోని తహసీల్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలకు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్మూర్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు జేఏసీ నాయకులు మాట్లాడారు. సమావేశంలో ఇట్టెడి లింగారెడ్డి, వి.ప్రభాకర్, దేగం యాదాగౌడ్ , దేవారాం, ఆకుల గంగారం తదితరులు పాల్గొన్నారు.