అక్షరటుడే ఆర్మూర్: మందుబాబులకు అడ్డాగా మారింది ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్. రాత్రి సమయాల్లో కొందరు బస్టాండ్ ఆవరణలో కార్లు, ద్విచక్ర వాహనాలు నిలుపుకొని మద్యం సేవిస్తున్నారు. బస్టాండ్ కు కూత వేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఎలాంటి జంకు లేకుండా మద్యం సేవిస్తూ ఖాళీ సీసాలను అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు. బస్సులు పార్కు చేసే సమయాల్లో టైర్ల కింద పడి పగిలిపోతున్నాయి. దీంతో అటుగా నడిచే ప్రయాణికులకు గాజు పెంకులు గుచ్చుకుని గాయాలపాలవుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ, పోలీస్ అధికారులు స్పందించి బస్టాండ్ ఆవరణలో మద్యం సేవించేవారి ఆట కట్టించాలని ప్రయాణికులు కోరుతున్నారు.