అక్షరటుడే, ఆర్మూర్: వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఆదివారం ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ వన్నెల్దేవి లావణ్య పరిశీలించారు. నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గాలను, గుండ్ల చెరువు వెళ్లే మార్గంలో మొరం పనులను పరిశీలించారు. చెరువు ప్రాంతంలో లైటింగ్, క్రేన్, గజ ఈతగాళ్లు ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఛైర్పర్సన్ వినాయకుడికి పూజలు నిర్వహించి గుండ్ల చెరువులో నిమజ్జనం చేశారు. ఆమె వెంట వైస్ ఛైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్ ఇట్టెడి నర్సా రెడ్డి, ఇంతియాజ్, ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయ్యప్ప శ్రీనివాస్, రింగుల భూషణ్, శివ తదితరులు పాల్గొన్నారు.