అక్షరటుడే, ఆర్మూర్ : పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్దులగుట్టపై సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. కొండ గుహలోని శివలింగానికి పంచామృత అభిషేకం, పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బి సుమన్, గంగారెడ్డి, మల్లయ్య, చరణ్ రెడ్డి, రవి, సంధ్య, శంకర్, శ్రీనివాస్, ప్రశాంత్ గౌడ్, మంజుల మురళి, హజారి సతీశ్, నరేశ్, రామాగౌడ్, సిద్దులగుట్ట సేవా సమితి, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.