అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : గణేశ్ నిమజ్జన వేడుకల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు. ఈ నెల 17న మంగళవారం మద్యం షాపులు మూసి ఉంచాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే కల్లు డిపోలు, బార్లు సైతం మూసి ఉంచాలని స్పష్టం చేశారు.